రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, ఆన్‌లైన్‌ టికెట్లపై సర్వీస్‌ చార్జిని తొలగించాలని రైల్వేకు ఆర్థిక శాఖ సూచించింది. అందుకయ్యే భారాన్ని తాము చెల్లిస్తామని తెలిపింది. ఈ ఏడాది జూలై 19న ఆ చార్జిని పునరుద్ధరించుకోవాలని రైల్వేకు ఆర్థిక శాఖ తెలిపింది.

తాము పరిమిత సమయానికి మాత్రమే భారాన్ని భరిస్తామన్నామని తేల్చిచెప్పింది. అప్పటికే రూ.88కోట్ల భారాన్ని రైల్వేకు ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తం చెల్లించినా ఐఆర్‌సీటీసీపై పడుతున్న భారం తీరదని రైల్వే బోర్డుకు అధికారులు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో సర్వీస్‌ చార్జిని పునరుద్ధరించుకునేందుకు అనుమతినిస్తూ ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసింది. దీని ప్రకారం సాధారణ స్లీపర్‌ బోగీలకు రూ. 20, ఏసీ బోగీలకు రూ.40 వరకూ ధరలు పెరగనున్నట్లు సమాచారం.

సర్వీస్ చార్జీ ఎత్తివేత తర్వాత ఇండియన్ రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఐఆర్‌సీటీకీ 2016-17లో ఇంటర్నెట్ టికెటింగ్ రెవెన్యూ 26 శాతం తగ్గింది. ఐఆర్‌సీటీసీకి ఏకంగా రూ.88 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని భరించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధంగా లేనందున సర్వీస్ చార్జీ పెంపును సూచిస్తూ ఈ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.సేవా పన్నుకు సమానమైన మొత్తాన్ని తాము చెల్లించడమన్నది తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ మొత్తాన్ని రాబట్టుకోవాలని రేల్వే శాఖ సూచించింది. ఇకపై తాము ఈ భారం భరించలేమని పరోక్షంగా వెల్లడించింది. దీంతో సరైన సమయంలో ఈ-టికెట్లపై మళ్లీ సేవా పన్నును విధించాలని భారతీయ రైల్వే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రీఫండ్ నిబంధనల కింద కొత్త ఛార్జీలను వసూలు చేయనుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల వల్ల రైళ్లు రద్దు అయితే టికెట్ ఛార్జీలను రీఫండ్  చేయనుంది. తన అధికారిక వెబ్ సైట్ irctc.co.in మెబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తోంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లు అయితే కొద్దిపాటి ఛార్జీలు ప్రయాణికులు భరించాల్సిఉంటుంది.రిఫండ్ మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు జమవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. ఎలాంటి రిఫండ్ రాదు. 
 

న్యూస్ టెక్నాలజీ మొబైల్స్ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇండియన్ రైల్వే రీఫండ్ రూల్స్ ఐఆర్‌సిటిసి